Veyi Subhamulu Kalugu Neeku : ఆహాలో ఆకట్టుకుంటోన్న విజయ్ రాజా ‘వేయి శుభములు కలుగు నీకు’..

టాలీవుడ్ ప్రముఖ నటుడిగా శివాజీ రాజాకు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. శివాజీ రాజా తనయుడిగా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ రాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

Veyi Subhamulu Kalugu Neeku movie released in aha

Veyi Subhamulu Kalugu Neeku : టాలీవుడ్ ప్రముఖ నటుడిగా శివాజీ రాజాకు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. శివాజీ రాజా తనయుడిగా ‘వేయి శుభములు కలుగు నీకు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ రాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. థియేటర్లో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు భవానీ మీడియా సంస్థ ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ అందరినీ మెప్పిస్తోంది.

Sharwanand: సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలుపుతున్న శర్వా!

లవ్, కామెడీ, హారర్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ రాజా నటన అందరినీ మెప్పిస్తుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం ‘వేయి శుభములు కలుగు నీకు’ ఆకట్టుకుంటోంది. మిలియన్ల వ్యూస్‌తో ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.

Oscar 2023 : ఆస్కార్‌‌కి ఎన్టీఆర్, చరణ్‌లు మాత్రమే కాదు జాక్వెలిన్ కూడా తన సాంగ్‌తో పోటీ పడుతుంది.. తెలుసా?

విజయ్ రాజా తన మొదటి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. అటు థియేటర్, ఇటు ఓటీటీ ప్రేక్షకులను కట్టి పడేశారు. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి ఈ సినిమాను నిర్మించారు.

విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. మాస్టర్ జయదేవ్‌, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.