విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘మోసగాళ్లు’ మోషన్ పోస్టర్..

  • Published By: sekhar ,Published On : September 18, 2020 / 02:32 PM IST
విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘మోసగాళ్లు’ మోషన్ పోస్టర్..

Updated On : September 30, 2020 / 1:38 PM IST

Mosagallu Motion Poster: మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో సినిమా రూపొందుతోంది. జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విష్ణు సోదరి పాత్రలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండటం విశేషం.


కాగా.. శుక్రవారం ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విక్టరీ వెంకటేష్ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్‌ ఇప్పుడిప్పుడే స్టార్ట్‌ అవుతున్న నేపథ్యంలో ‘మోసగాళ్లు’ షూటింగ్‌ త్వరలోనే రీస్టార్ట్‌ కానుంది. రుహానీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.