Ankita : భర్తను చెప్పుతో కొట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. భర్త వేరే కంటెస్టెంట్‌తో..
హిందీ బిగ్ బాస్ సీజన్ 17 దూసుకుపోతోంది. హౌస్‌లో ఉన్న ఇద్దరు కపుల్స్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కంటెస్టెంట్ తన భర్తపై చెప్పులు విసిరింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Updated on- November 23, 2023 / 02:48 PM IST
Ankita
Ankita : హిందీ బిగ్ బాస్ సీజన్ 17 చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. హౌస్‌లో ఉన్న భార్యాభర్తలు అంకిత, విక్కీ జైన్ మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. తాజాగా భర్త విక్కీని అంకిత చెప్పుతో కొట్టడం జనాలను షాక్‌కి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో, ఫోటో లీక్.. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్..
హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ఎప్పటిలాగే ప్రేక్షకుల్ని అలరిస్తోంది. సీరియల్ నటులు నిజ జీవితంలో భార్యాభర్తలైన అంకిత, విక్కీ జౌన్ హౌస్‌లో ఉన్నారు. లోపలికి వెళ్లినప్పటి నుంచి వీరిద్దరి మధ్యా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర హౌస్ మేట్స్‌తో విక్కీ సరదాగా ఉండటం అంకితకు నచ్చపోవడంతో హోస్ట్‌కు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో విక్కీ తను కేవలం ఆట మీదనే కాన్సన్ట్రేషన్ చేసినట్లు వివరణ ఇచ్చారు.
Animal Trailer : రణబీర్ కపూర్ ‘యానిమల్’ నుంచి వైల్డ్ ట్రైలర్ వచ్చేసింది..
విక్కీ జైన్ హౌస్‌మేట్ సనాతో కూడా కాస్త చనువు ఉన్నారు. ఆమె చేయి పట్టుకుని కనిపించడంతో నెటిజన్స్ మండిపడ్డారు. భార్య ఉండగా ఇదేం పని అంటూ తిట్టిపోశారు. సనానే అతని చెయ్యి పట్టుకుందని కొందరు సమర్ధించారు. కాగా ఇటీవల విక్కీ, అంకిత కాస్త సరదాగా కనిపించారు. విక్కి చేసిన సరదా పనితో అంకితకు మళ్లీ కోపం వచ్చింది. వెంటనే తన చెప్పులను తీసుకుని విక్కీపై విసిరింది. కంటెస్టెంట్స్ అంతా చూస్తుండగా భర్తపై చెప్పులు విసిరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు వీళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు.
