The Dirty Picture : బోల్డ్ హిట్.. డర్టీ పిక్చర్ పార్ట్ 2 వచ్చేస్తుంది.. ఈ సరి ఎవరి కథ చెప్తారో?
సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 2011 లో విద్యా బాలన్ మెయిన్ లీడ్ గా వచ్చిన డర్టీ పిక్చర్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. (The Dirty Picture)
- Saketh U
- Published on- October 12, 2026 / 04:42 PM IST
The Dirty Picture
The Dirty Picture : సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 2011 లో విద్యా బాలన్ మెయిన్ లీడ్ గా వచ్చిన డర్టీ పిక్చర్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. హిందీలోనే కాక సౌత్ లో కూడా ఈ సినిమా హిట్ అయింది. చాలా బోల్డ్ గా రొమాన్స్, సినీ పరిశ్రమలోని చీకటి జీవితం, సిల్క్ స్మిత జీవితం.. ఇవన్నీ చూపించారు. ఈ సినిమా పాటలు కూడా అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి.
సిల్క్ స్మిత జీవిత కథగా అడల్ట్ సినిమాగా వచ్చిన డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మిత మరణంతోనే కథ ముగుస్తుంది. అయితే ఇప్పుడు డర్టీ పిక్చర్ పార్ట్ 2 తీస్తున్నారట. తాజాగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఇటీవల దీని గురించి ప్రకటించింది. కానీ టైటిల్ ఇదే అయినా ఈ సారి మరో అమ్మాయి కథ చెప్తారంట.
Also Read : Allu Aravind : 30 ఏళ్లు.. తన చేతుల మీదుగానే లాంచ్.. పవన్ కి అల్లు అరవింద్ స్పెషల్ విషెష్..
ఈసారి కూడా సినీ పరిశ్రమలోని కష్టాలు, చీకటి కోణం, మహిళల ఇబ్బందులే మరో నటి కథ ఆధారంగా చూపించబోతున్నారట. విద్యా బాలన్ బదులు ఈసారి మరో హీరోయిన్ నటిస్తుందని సమాచారం. అలాగే ఇది ఫ్రాంచైజ్ లాగా డర్టీ పిక్చర్ పేరుతోనే వేర్వేరు కథలతో సినిమాలు తీస్తామని కూడా ప్రకటించింది ఏక్తా కపూర్. మరి డర్టీ పిక్చర్ లో విద్యా బాలన్ చేసిన రేంజ్ లో పార్ట్ 2 హీరోయిన్ చేసి మెప్పిస్తుందా? అసలు ఎవరు చేయబోతున్నారు తెలియాలంటే ఎదురుచూడాలి.
