Allu Aravind : 30 ఏళ్లు.. తన చేతుల మీదుగానే లాంచ్.. పవన్ కి అల్లు అరవింద్ స్పెషల్ విషెష్..
సినీ పరిశ్రమలో పవన్ 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో నిర్మాత అల్లు అరవింద్..(Allu Aravind)
Allu Aravind
Allu Aravind : పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వచ్చి నిన్నటికి 30 ఏళ్ళు పూర్తయింది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. సినీ పరిశ్రమలో పవన్ 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు.
Also See : Irumudi Actress Sam : పట్టుపరిణిలో ఇరుముడి నటి.. సామ్ ట్రెడిషినల్ ఫొటోలు..
ఈ నోట్ లో అల్లు అరవింద్.. డియర్ పవన్ కళ్యాణ్.. మన ఇద్దరి మొదటి సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను, దాదాపు దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ పరిశ్రమలో మీది ఎంత అద్భుతమైన ప్రయాణం. ఈ ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంచుకునే ఏ మార్గంలోనైనా మరెన్నో సంవత్సరాలు విజయం, సంతృప్తిని పొందాలని కోరుకుంటున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న విశాల దృక్పథాన్ని, సినిమాకు అతీతంగా మీరు చేస్తున్న సేవలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రియమైన కళ్యాణ్, మరోసారి అభినందనలు. నా శుభాకాంక్షలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి అని తెలిపారు.

