Vijay announced his next movie with Venkat Prabhu
Vijay : తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి(Sankranthi) తమిళ్, తెలుగులో వారసుడు(Varasudu) సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. ప్రస్తుతం విజయ్ 67వ సినిమాగా లియో(Lio) తెరకెక్కుతుంది. తమిళ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో సినిమా భారీగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్, గౌతమ్ మీనన్.. మరింతమంది ప్రముఖులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా విజయ్ నెక్స్ట్ సినిమా అకస్మాత్తుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా విజయ్ నెక్స్ట్ సినిమా వెంకట్ ప్రభుతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు నాగ చైతన్యతో కస్టడీ సినిమా తీశాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, బాగున్నా, నెగిటివ్ ప్రచారం వల్ల కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు వెంకట్ ప్రభు విజయ్ తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు.
NTR : ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఎలా చెప్పాడో తెలుసా?
AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ 68వ సినిమాను తాజాగా ప్రకటించారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నాడు. ఈ అధికారిక ప్రకటనను విజయ్ స్వయంగా పోస్ట్ చేశాడు. ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను ప్రకటిస్తూ నా కల నెరవేరబోతోంది అని రాశారు. విజయ్ లియో సినిమా షూట్ పూర్తయ్యాక ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. 2024 సమ్మర్ కి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Next… pic.twitter.com/iw1M5Dy7x9
— Vijay (@actorvijay) May 21, 2023