Vijay Antony : కూతురు ఆత్మహత్య తర్వాత మొదటసారి మీడియా ముందుకు విజయ్ ఆంటోనీ.. చిన్న కూతురితో సినిమా ప్రమోషన్స్‌ కోసం..

తాజాగా విజయ్ ఆంటోనీ తన తర్వాత సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. విజయ్ ఆంటోనీ నటించిన రత్తం అనే సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.

Vijay Antony came to the media for the first time after his daughter Passed away in Raththam Movie Promotions

Vijay Antony : తమిళ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. కూతురి మరణంతో విజయ్ ఆంటోనీ, వాళ్ళ ఫ్యామిలీ తీవ్ర విషాదంలోకి వెళ్లారు. అభిమానులు, పలువురు ప్రముఖులు విజయ్ ఆంటోనీకి సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెప్పి ఆయన త్వరగా ఆ బాధ నుంచి బయటకు రావాలని కోరుకున్నారు.

తాజాగా విజయ్ ఆంటోనీ తన తర్వాత సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. విజయ్ ఆంటోనీ నటించిన రత్తం అనే సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పరిస్థితి చూసి రత్తం సినిమా మళ్ళీ వాయిదా వేయాలనుకున్నారు. కానీ నిర్మాతలకు నష్టం కలగకూడదని సినిమాని అదే టైంకి రిలీజ్ చేయమని చెప్పి, ప్రమోషన్స్ కి వస్తానని చెప్పినట్టు సమాచారం.

Also Read : Salaar : సలార్ అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసేంది.. షారుఖ్ వర్సెస్ ప్రభాస్ ఫిక్స్..

దీంతో నిన్న రాత్రి చెన్నైలో రత్తం సినిమా ప్రెస్ మీట్ జరగగా చిత్రయూనిట్ తో పాటు విజయ్ ఆంటోనీ కూడా పాల్గొన్నారు. అయితే విజయ్ ఆంటోనీ ఈ ప్రెస్ మీట్ కి తన చిన్న కూతురు లారాని తీసుకురావడం విశేషం. దీంతో విజయ్, లారా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూతురు మరణించిన కొన్ని రోజులకే దుఃఖం దిగమింగుకోని నిర్మాతలకు నష్టం కలగకూడదని తన సినిమా ప్రమోషన్స్ కి విజయ్ రావడంతో అభిమానులు, పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.