Vijay Antony met an accident in bichagadu 2 shooting
Vijay Antony : తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని.. తెలుగు వారికీ బిచ్చగాడు సినిమాతో దగ్గర అయ్యాడు. మ్యూజిక్ కంపోజర్ గా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ ఎడిటర్ గా, సింగర్ గా, పాటల రచయితగా, నటుడిగా నటిస్తూ ప్రతి క్రాఫ్ట్స్ లోను సత్తా చాటుతున్నాడు. తాజాగా మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా కూడా మారబోతున్నాడు. తనకి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన బిచ్చగాడు సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు ఈ హీరో. కాగా ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనినే డైరెక్ట్ చేస్తున్నాడు.
Bichagadu 2: విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ వచ్చేది అప్పుడే!
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. అక్కడ సముద్రంలో ఒక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా విజయ్ కి ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు మూవీ మేకర్స్. మలేషియా లోని కౌలాలంపూర్ బీచ్ లో విజయ్ ఆంటోని బోట్ పై వెళుతున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో.. బోట్ అదుపు తప్పి కెమెరా ఉన్న బోట్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు అయ్యిని. దీంతో చిత్ర యూనిట్ వెంటనే మలేసియాలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్లు వెల్లడించింది.
విజయ్ ఆంటోని ప్రెజెంట్ బాగానే ఉన్నారు అని. త్వరలోనే అయన మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు అని. కంగారు పడవలసిన అవసరం లేదని అభిమానులకు మూవీ మేకర్స్ తెలియజేశారు. కాగా బిచ్చగాడు సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించి, విజయ్ కి ఇక్కడ మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుండడంతో, తెలుగులోనూ ఈ చిత్రంపై మంచి హైపే నెలకుంది. మరి ఈ సీక్వెల్ కూడా బిచ్చగాడులా అలరించి, విజయ్ ఆంటోనికి దర్శకుడిగా కూడా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. కాగా విజయ్ ఆంటోని ఈ సినిమాతో పాటు ఈ ఏడాదిలో మరో అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.