Love Guru : భార్యని వన్ సైడ్ లవ్ చేయడమేంట్రా? లవ్ గురు ట్రైలర్ చూశారా?

తాజాగా లవ్ గురు ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా నవ్వించింది.

Vijay Antony Mirnalini Ravi Love Guru Trailer Released

Love Guru : తమిళ్ హీరో విజయ్ ఆంటోనికి(Vijay Antony) తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం బిచ్చగాడు 2 సినిమాతో వచ్చి తెలుగులో కూడా హిట్ కొట్టాడు. ఇప్పుడు త్వరలో లవ్ గురు అనే సినిమాతో రాబోతున్నాడు విజయ్ ఆంటోనీ. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి(Mirnalini Ravi) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రోమియో’. ఈ సినిమాని తెలుగులో ‘లవ్ గురు’ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా లవ్ గురు ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా నవ్వించింది. అమ్మాయికి ఇష్టం లేకుండా హీరో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి కష్టాలు పడ్డాడు, తన భార్యని ఎలా మార్చుకున్నాడు అనే కథాంశాన్ని కామెడీగా చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ మొదట్లో నేను నా భార్యని వన్ సైడ్ లవ్ చేస్తాను మామయ్య.. అంటూ హీరో చెప్పిన డైలాగ్ కామెడీగా అనిపించినా సినిమాకు తగ్గట్టు ఉంది. మీరు కూడా ఈ లవ్ గురు కామెడీ ట్రైలర్ చూసేయండి.

 

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా? ఇవాళ షూటింగ్ ఎక్కడంటే..?

ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కామెడీ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇలాంటి రామ్ కామ్ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. లవ్ గురు సినిమా రంజాన్ కానుకగా ఏప్రిల్ 11న రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా అధికారిక డేట్ ప్రకటించలేదు. ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.