Vijay Antony : కూతురి మరణం తరువాత.. మొదటి సారి స్పందించిన విజయ్ ఆంటోనీ
హీరో విజయ్ ఆంటోనీ కూతురు లారా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కూతురి మరణం తరువాత విజయ్ ఆంటోనీ తొలిసారి స్పందించారు.

Vijay Antony
Vijay Antony Breaks Silence : హీరో విజయ్ ఆంటోనీ కూతురు లారా (Laura) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కూతురి మరణం తరువాత విజయ్ ఆంటోనీ తొలిసారి స్పందించారు. తన కూతురితో పాటు తాను చనిపోయానంటూ భావోద్వేగానికి గురైయ్యారు. ఇక నుంచి తను చేయబోయే ప్రతి మంచి పనికి తన కూతురు పేరే పెట్టనున్నట్లు చెప్పారు. దీనితోనైనా ఆమెతో కలిసి ఉన్నట్లుగా ఉంటుందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
“నా కూతురు ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు కూడా. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, చెడు, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన చోటుకి వెళ్లింది. అయినప్పటికీ ఆమె ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆమె చనిపోయినప్పుడు తనతో పాటు నేను చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి మంచి పనిని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.” అంటూ విజయ్ ఆంటోనీ ఎక్స్ (ట్విటర్)లో ఓ లేఖను పోస్ట్ చేశారు.
Nayanthara : దర్శకుడు అట్లీ పై నయనతార అసంతృప్తి..? కారణం దీపికేనా..?
విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా (16) మంగళవారం చెన్నైలోని నివాసంలో తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో విజయ్ ఆంటోనీ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. బుధవారం నాడు అంత్యక్రియలను నిర్వహించారు. చదువుల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
— vijayantony (@vijayantony) September 21, 2023