×
Ad

Vijay: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సీబీఐ ఎదుట విచారణకు హాజరైన విజయ్

కరూర్ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Vijay) సీబీఐ ముందు హాజరయ్యారు.

Vijay appeared before the CBI as part of the investigation into the Karur incident.

  • కరూర్‌ తొక్కిసలాట ఘటన
  • నేడు సీబీఐ విచారణకు హాజరైన విజయ్
  • సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం

Vijay: కరూర్‌ తొక్కిసలాట ఘటన విచారణలో భాగంగా నేడు సీబీఐ ఎదుట హాజరయ్యారు తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Vijay). ఈ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న విజయ్‌కి గతవారంలోనే సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు(జనవరి 12) ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు విజయ్.

MSVG Styliesh Looks: మన శంకరవరప్రసాద్ గారు మూవీలో చిరు స్టైలిష్ లుక్స్.. ఫొటోలు

ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగనుందని సమాచారం. ఇక 2024 సెప్టెంబర్‌ 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్‌ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీగా విజయ్ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 41 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

110 మందికి పైగా గాయపడ్డారు. ఈ ధుర్ఘటనపై సుప్రీం కోర్ట్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే గత వారం సీబీఐ అధికారులు విజయ్‌కి సమన్లు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ఇవాల(జనవరి 12) ఉదయం చెన్నై నుంచి ఢిల్లీ వచ్చిన విజయ్‌.. సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక విజయ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. కొత్త విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.