ముగ్గురు ముద్దుగుమ్మలతో…

యేటివ్ కయర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్, ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.

  • Publish Date - February 2, 2019 / 10:39 AM IST

యేటివ్ కయర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్, ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలతో స్టార్‌గా, యూత్ ఐకాన్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ, ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు. క్రియేటివ్ కయర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్, ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. విజయ్ పక్కన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో రూపొందబోతుంది.  విజయ్ నటించిన ద్వారక సినిమా, అర్జున్ రెడ్డి పేరుతో తమిళ్‌లో రిలీజ్ కానుంది.