Vijay Devarakonda : VD12 అప్డేట్ త్వరలో.. గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమా శరవేగంగా..

విజయ్ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించి ఫుల్ స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు విజయ్.

Vijay Devarakonda VD 12 Update : రౌడీ హీరో లైన్లోకొస్తున్నాడు. ఇప్పటికే లేటయ్యిందని సినిమాల స్పీడ్ పెంచాడు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కెరీర్ గ్రాఫ్ విషయంలో కాస్త స్లో అయిన విజయ్.. ఇప్పుడు అసలు ఆగేదేలే అంటున్నాడు. వరసపెట్టి సినిమాల్ని లైన్లో పెట్టిన విజయ్.. అంతే స్పీడ్ గా అప్ డేట్స్ కూడా ఇస్తున్నాడు. మొన్నీమధ్యే స్టార్ట్ చేసిన తన కొత్త సినిమాకు సంబందించి అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు ఈ రౌడీ హీరో.

మొన్నటి వరకూ స్లో అండ్ స్టడీ అంటూ వచ్చిన విజయ్ ఇప్పుడు మాత్రం ఇలా కుదరదని డిసైడ్ అయ్యాడు. ఖుషీ సినిమా కంప్లీట్ అవ్వకముందే కొత్త సినిమా స్టార్ట్ చేసిన ఆ సినిమా షూటింగ్ విషయంలో జెట్ స్పీడ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా వస్తోన్న గౌతమ్ తిన్ననూరి మూవీ నుంచి అప్పుడే అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు విజయ్ దేవరకొండ.

విజయ్ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించి ఫుల్ స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు విజయ్. పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫార్చ్యూన్ , శ్రీకర బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబందించి షెడ్యూల్స్ వన్ బై వన్ కంప్లీట్ చేసేస్తున్నారు.

Also Read : Mega 157 : మెగాస్టార్ ఏజ్‌కి తగ్గ రోల్ చేస్తారు.. రజినీకి జైలర్.. కమల్ కి విక్రమ్.. చిరంజీవికి ‘మెగా 157’

విజయ్, గౌతమ్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. కెరీర్ లోనే పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో రాబోతున్న విజయ్.. ఈ సినిమాకు సంబంధించి అంతే పవర్ ఫుల్ లుక్ ని రివీల్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. అంతేకాదు.. ఫస్ట్ లుక్ అదిగో ఇదిగో అంటూ ఫాన్స్ ని టీజ్ కూడా చేస్తున్నారు. ఇదే రేంజ్ స్పీడ్ లో సినిమా కంప్లీట్ అయితే ఇయర్ ఎండ్ కి సినిమా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు ఫాన్స్. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు