Vijay Devarakonda instagram post gone viral
Vijay Devarakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందనతో ప్రేమాయణం నడుపుతున్నాడని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలుపై ఈ జంట స్పందిస్తూ.. మేము ఇద్దరం కేవలం స్నేహితులు మాత్రమే, మా మధ్య ప్రేమ అనే రేలషన్‌షిప్ లేదని చెప్పినా అభిమానులు మాత్రం అవి నమ్మడం లేదు. ఇటీవలే వీరిద్దరూ ఒకే రోజు విడివిడిగా మాల్దీవులకు వెళ్లి రావడం కూడా విశేషం.
Vijay Devarakonda: ‘ఖుషి’ని పక్కనబెట్టి ఆటలాడుతానంటోన్న దేవరకొండ.. నిజమేనా?
కాగా ఇప్పుడు మళ్ళీ ఈ విషయం తెరపైకి వచ్చింది. రష్మిక మాల్దీవిస్ కి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోలను ఆ సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా విజయ్ విజయ్ దేవరకొండ 2022కి గుడ్ బై చెబుతూ ఒక ఫోటోని షేర్ చేశాడు. “గత ఏడాదిలో మనకి ఎన్నో ఆనందకర క్షణాలు ఉన్నాయి, బాధ పడిన క్షణాలు ఉన్నాయి, లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒకసారి గెలిచాం, ఒకసారి ఓడిపోయాం.. అయినా సరే వీటన్నిటిని సెలెబ్రేట్ చేసుకోవడమే జీవితం. హ్యాపీ న్యూ ఇయర్” అంటూ ఎమోషనల్ కాప్షన్ కూడా పెట్టాడు.
అయితే అభిమానులు మాత్రం ఈ ఎమోషనల్ కాప్షన్ చూడకుండా, ఫొటోలోని బ్యాక్‌గ్రౌండ్ అండ్ క్లైమేట్‌ని గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో రష్మిక షేర్ చేసిన ఫోటోలో కూడా అలాంటి బ్యాక్‌గ్రౌండ్ అండ్ క్లైమేట్ ఉండడంతో, ఫ్యాన్స్ ఈ రెండు ఫోటోలను జత చేసి షేర్ చేస్తూ.. ‘మీరు ఒప్పుకోక పోయిన మీ మధ్య ఏముందో మాకు అర్ధమవుతుందిలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.