kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డ‌మ్ మ‌ళ్ళీ వాయిదా? కార‌ణం ఇదే..?

కింగ్‌డమ్‌ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తోన్న విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ తప్పేలా లేదు

Vijay Devarakonda KINGDOM movie once again post pone

కింగ్‌డమ్‌ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తోన్న విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మరోసారి పోస్ట్‌పోన్‌ అయ్యేలా క‌నిపిస్తోంది. ఆల్రెడీ మే 30న రిలీజ్ చేస్తామని గతంలోనే అనౌన్స్‌ చేసినా.. మళ్లీ జులై 4కు పోస్ట్‌పోన్ చేశారు. నితిన్‌ తమ్ముడు సినిమా ఆ డేట్‌కి కన్ఫర్మ్‌ అవ్వడం.. ప్రమోషన్స్ స్టార్ట్‌ చేయడంతో విజయ్‌ సినిమా మరోసారి వెనక్కి వెళ్లడం పక్కా అంటున్నారు ఆడియెన్స్.

విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌ మరింత లేట్‌ అవ్వడానికి రీజన్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండటమే అనే చర్చ జరుగుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ కింగ్‌డమ్‌ సినిమా రీరికార్డింగ్‌ వర్క్‌ని ఇంకా కంప్లీట్‌ చేయనట్లుగా తెలుస్తోంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కోసం మరింత సమయం తీసుకుంటున్న అనిరుధ్.. ఈ మంత్‌ ఎండింగ్‌లోగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నారు. వన్స్‌ అనిరుధ్‌ సినిమాకి ఆర్ఆర్‌ ఫినిష్‌ చేస్తే.. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసి.. మరింత ప్రమోషనల్ కంటెంట్‌ని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది కింగ్‌డమ్‌ యూనిట్.

Balakrishna vs Pawan Kalyan : బాల‌య్య వ‌ర్సెస్ ప‌వ‌న్‌.. థియేట‌ర్లలో ర‌చ్చ ర‌చ్చే..

కింగ్‌డమ్ సినిమాని పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. 110 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాలో విజయ్‌కి జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్‌తో కలిసి శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ కంబైన్డ్‌గా కింగ్‌డమ్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి జులై 4న థియేటర్స్‌లోకి రావాల్సిన విజయ్‌ సినిమా.. అనిరుథ్‌ కారణంగా పోస్ట్‌పోన్‌ అవ్వడంతో డిజపాయింట్‌ అవుతున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.