క్రాంతిమాధవ్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నవిజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ.. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలతో స్టార్‌గా, యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా-30 లో ప్లేస్ దక్కించుకున్నాడు. పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు తన వంతు సాయం చేసి, రియల్ హీరో అనిపించుకున్నాడు. విజయ్ ప్రస్తుతం ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. క్రియేటివ్ కయర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్.. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా, కేథరిన్‌లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ మధ్య ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా, ఐశ్వర్య రాజేష్ పోర్షన్ ఫినిష్ అయ్యింది.
ఈ సినిమాలో విజయ్ ఫస్ట్ టైమ్ ఫాదర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, బాయ్ ఫ్రెండ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ.. ఈ సినిమాలో 8 ఏళ్ళ పిల్లాడికి తండ్రిగా నటిస్తున్నాడు. అంతేకాదు, సింగరేణి కార్మికుల యూనియన్ లీడర్‌గానూ కనిపించనున్నాడట. ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. దీనితోపాటు, భరత్ కమ్మ డైరెక్షన్‌లో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు విజయ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.