Vijay Devarakonda Samantha Kushi Movie Audio Launch Musical Concert on August 15th
Kushi Movie : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ(Shiva Nirvana) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ మెప్పిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.
ఇక ఖుషి చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తున్నారు. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు. అలాగే విడుదల కానీ మరో రెండు పాటలని కూడా ఈ ఖుషి ఆడియో లాంచ్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఖుషి ఆడియో లాంచ్ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు.
ఇక ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ కి విజయ్, సమంత అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఖుషి ఈవెంట్ ని స్పైరో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థగా కొత్తగా ప్రారంభమైన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్పైరో ఈవెంట్స్. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ తోనే స్పైరో ఈవెంట్స్ టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది.