Vijay and Rashmika at Cafe : కేఫ్‌లో కనిపించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. కన్ఫామ్‌గా డేటింగ్‌లో ఉన్నారంటూ ..

విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్‌లో ఉన్నారా? ఈ ప్రశ్నకు చాలా కాలంగా సరైన సమాధానం దొరకట్లేదు ఫ్యాన్స్‌కి. మా మధ్య ఏం లేదని ఇద్దరూ చెబుతున్నా తాజాగా కేఫ్‌లో ఇద్దరు కలవడంతో అభిమానుల అనుమానాలకు బలం చేకూరుతోంది.

Vijay and Rashmika at Cafe

Vijay and Rashmika at Cafe : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో తరచుగా వీరిద్దరూ కనిపిస్తుండటం పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మా మధ్య అలాంటిది ఏదీ లేదని ఇద్దరు ఖండించినా తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి కేఫ్‌లో కనిపించడం మళ్లీ అనుమానాలకు తెర లేపింది. దీంతో అభిమానుల్లో కొత్త డౌట్స్ మొదలయ్యాయి.

Vijay Deverakonda : మహేష్, ప్రభాస్‌తో పోటీకి విజయ్ దేవరకొండ.. పరశురాంతో సినిమా సంక్రాంతికి..?

విజయ్ దేవరకొండ, రష్మిక తరచుగా కలిసి తిరుగుతూ ఉంటారు. స్నేహితులతో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి గేదర్ అవుతుంటారు. కలిసి విహారయాత్రలు చేయడం.. ఎయిర్ పోర్టులలో కనిపించడం అందరికీ తెలిసిందే. మేము మంచి స్నేహితులము మాత్రమే అని వారు చెప్పుకున్నప్పటికీ ఇద్దరు కలిసినప్పుడల్లా పెద్ద వార్త అవుతోంది. తాజాగా ఈ జంట ఒక కేఫ్‌లో కనపడటంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అంటూ మళ్లీ చర్చ మొదలైంది. కేఫ్‌లో వీరితో పాటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఆనంద్ దేవరకొండ మరియు పెరియా వర్మలు కూడా ఉన్నారు. నిజానికి రష్మిక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది. అతని ప్రతి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటుంది.

Rashmika Mandanna : రష్మికను మోసం చేసిన మేనేజ‌ర్‌.. ల‌క్ష‌ల్లో న‌ష్టం.. శ్రీవ‌ల్లి ఏం చేసిందంటే..?

విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లే వీరి రిలేషన్ షిప్ గురించి పుకార్లు పుట్టాయని చెప్పాలి. డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో వీరిద్దరి మధ్య రిలేషన్, కెమిస్ట్రీ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. అలా వారి మధ్య ఏదో ఉండి ఉండవచ్చనే అనుమానం రేకెత్తించింది. ఇటీవల కాలంలో చాలామంది టాలీవుడ్ హీరోలు పెళ్లి పీటలు ఎక్కారు. ఎప్పటి నుంచో వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. వీరిలాగే ఎప్పుడో సడెన్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక అనౌన్స్‌మెంట్ చేసినా ఆశ్చర్యం లేదని అందరూ చర్చించుకుంటున్నారు.