×
Ad

Vijay Deverakonda : యాదాద్రి ఆలయం గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్.. తెలంగాణ ప్రభుత్వం..

ఖుషి మంచి విజయం సాధించడంతో నేడు కుటుంబంతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని విజయ్ దేవరకొండ దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

  • Published On : September 3, 2023 / 04:49 PM IST

Vijay Deverakonda comments on TRS party about yadadri temple

Vijay Deverakonda : శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి (Kushi) సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. దీంతో ఖుషి మూవీ టీం అండ్ ఆనంద్ దేవరకొండతో సహా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ అంతా నేడు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Kushi Movie Collections : ఖుషి సెకండ్ డే కలెక్షన్స్.. యాదాద్రిలో కుటుంబంతో సహా విజయ్ పూజలు..

దర్శనం అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ ఇయర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. మా బ్రదర్ ఆనంద్ బేబీ మూవీ, ఇప్పుడు నేను చేసిన ఖుషి రెండు విజయం సాధించాయి. అందుకనే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చాము. కొన్నేళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆలయం పెద్దగా బాగోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మాణంతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.

Kushi : రెండు రోజులోనే అమెరికాలో ఆ రికార్డుని అందుకున్న ఖుషి..

ఈ విషయమై దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు వై రవి శంకర్, నవీన్ యెర్నేని తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇక తమకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా వీలు కల్పించిన ఆలయ అధికారులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే ఈ ఏడాది మైత్రీ మేకర్స్ సంస్థకు కూడా కలిసొచ్చిందని గుర్తు చేశాడు. వాళ్ళు నిర్మించిన రెండు సినిమాలకు నేషనల్ అవార్డు వచ్చిందని, ఇప్పుడు ఖుషి కూడా మంచి సక్సెస్ అయ్యిందని, తమలాగే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని దేవుడిని కోరుకున్నట్లు పేర్కొన్నాడు.