Vijay Deverakonda
Vijay Deverakonda : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన వాళ్ళల్లో విజయ్ దేవరకొండ ఒకరు. గత కొంతకాలంగా ఆశించినంత విజయాలు అందుకోకపోయినా స్టార్ డమ్ మాత్రం అలాగే మెయింటైన్ చేసారు. తాజాగా విజయ్ కింగ్డమ్ సినిమాతో వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 53 కోట్లు కలెక్ట్ చేసింది.
నేడు కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా చెప్పాడు.
Also Read : Coolie : రజనీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ నాగార్జున వర్సెస్ సూపర్ స్టార్ రజినీ..
విజయ్ దేవరకొండ నెక్స్ట్ చేయబోయే సినిమాలు..
రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివర్లో మొదలవ్వనుంది. ఇందులో రాయలసీమ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. సీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది.
ఆ తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఆంధ్రా నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
అనంతరం సుకుమార్ తో ఒక సినిమా బ్యాలెన్స్ ఉంది. సుకుమార్ చరణ్ సినిమా అయ్యాక విజయ్ తో చేస్తాడని సమాచారం. సుకుమార్ తో సినిమా కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు విజయ్.
Also Read : Kingdom : ఆ సాంగ్ యాడ్ చేసి ‘కింగ్డమ్’ మళ్ళీ రిలీజ్.. ఎప్పట్నించి అంటే..
అలాగే కింగ్డమ్ సినిమాకు పార్ట్ 2 , పార్ట్ 3 కూడా ఉన్నాయని చెప్పాడు. పార్ట్ 2 సీక్వెల్ కాగా, పార్ట్ 3 మొదటి భాగానికి ప్రీక్వెల్. ఈ రెండు సినిమాలు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి.
అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా కచ్చితంగా ఇంకో సినిమా ఉంటుందని, అతని చేతిలో ఉన్న ప్రభాస్, బన్నీ, యానిమల్ సీక్వెల్ సినిమాలు అయ్యాక ఉండొచ్చు అని తెలిపాడు విజయ్. ఇలా విజయ్ దేవరకొండ చేతిలో అరడజను భారీ సినిమాలు పెట్టుకొని దూసుకుపోతున్నాడు.