Vijay Deverakonda
Vijay Deverakonda : రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ నేడు జరగ్గా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. విజయ్ – రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవల కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఈ ఈవెంట్లో కలిసి కనిపిస్తుండటంతో ఈవెంట్ పై మంచి హైప్ నెలకొంది.
ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మొదట సినిమా గురించి మాట్లాడాడు. అనంతరం సినిమాలో నటించినవాళ్లు, పనిచేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ రష్మిక గురించి స్పెషల్ గా మాట్లాడాడు.
Also See : Vijay Deverakonda : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. విజయ్ దేవరకొండ ఫుల్ స్పీచ్..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రష్మికని నేను గీత గోవిందం నుంచి చూస్తున్నాను. ఆమె నిజంగానే భూమాదేవీనే(ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక పాత్ర). ఒక అమాయకత్వం, అందరూ హ్యాపీగా ఉండాలి, తన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి అని కోరుకుంటుంది. తన గురించి ఆలోచించదు. ఏం చెప్పినా చేస్తుంది. అక్కడ్నుంచి ఇవాళ ఒక వుమెన్ గా మారి ఇలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం, కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఈ సినిమా చేయడం చాలా మందికి ఇన్‌స్పిరేషన్ తను.
ఇది నువ్వు చెప్పాల్సిన కథ. రష్.. నీ జర్నీ చూసి నేను గర్వపడుతున్నాను. తనని కూడా చాలా మంది చాలా మాటలు అన్నారు. నన్ను ఎవరేమన్నా అంటే నేను రివర్స్ లో వేస్తా. రష్ ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా మంచితనమే చూపిస్తుంది. తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటుంది. ఏదో ఒక రోజు ప్రపంచం నువ్వేంటో చూస్తుంది. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. నువ్వు ఒక అద్భుతమైన మహిళవి. మేము నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాము అని తెలిపాడు. దీంతో రష్మిక గురించి విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Rashmika Mandanna : విజ్జు.. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలి.. విజయ్ గురించి రష్మిక స్పీచ్ వైరల్..