×
Ad

Vijay Deverakonda : అప్పుడు విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేయని దిల్ రాజు.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్..

అప్పుడు విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేయని దిల్ రాజు.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా చేయడమే కాదు మరో సినిమాలకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు.

  • Published On : April 1, 2024 / 05:13 PM IST

Vijay Deverakonda is rejected by dil raju when his struggling days

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ హీరో అవకాశాలు కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు. ఈక్రమంలోనే దిల్ రాజు నిర్మిస్తున్న ఓ సినిమాకి కూడా ఆడిషన్ ఇచ్చారు. కానీ అప్పుడు విజయ్ ని సెలెక్ట్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు విజయ్ తోనే ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేయడమే కాకుండా, మరో రెండు సినిమాలకు కూడా విజయ్ దగ్గర డేట్స్ తీసుకున్నారు దిల్ రాజు. ఇంతకీ అప్పుడు విజయ్ ని సెలెక్ట్ చేయని సినిమా ఏంటి..?

2015లో సుమంత్ అశ్విన్, విస్వంత్, పార్వతీశం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కేరింత’. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఆడిషన్ ఇచ్చారట. కానీ అప్పుడు విజయ్ ని ఎంపిక చేసుకోలేదు. అప్పటికి విజయ్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు. కేరింత సమయానికి శేఖర్ కముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు.

Also read : Vijay Deverakonda : కరోనా టైంలో విజయ్ దగ్గర మనీ లేక.. దిల్ రాజు దగ్గర అప్పు తీసుకున్నారట..

అయినాసరి కేరింతలో అవకాశం రాలేదు. దీంతో విజయ్ బాగా హర్ట్ అయ్యారంట. వీళ్ళందరికీ తానేంటో హీరో అయ్యి చూపిస్తానని విజయ్ మనసులో అనుకున్నారట. అలా అనుకోని నేడు దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేసే స్థాయికి ఎదిగారు. ఇక్కడ మరో విశేషం ఎంతంటే.. దిల్ రాజు తన హీరోలకు ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వరు. సినిమా స్టార్ట్ చేసిన తరువాతే హీరోలకు అయినా, ఎవరికైనా అడ్వాన్స్ లు ఇస్తారు.

కానీ మొదటిసారి విజయ్ కి దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చి ఫ్యామిలీ స్టార్ సినిమా చేసారు. ఇది కదా విజయ్ సక్సెస్ అంటే. కాగా ఈ సినిమా తరువాత దిల్ రాజు, విజయ్ తో మరో సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. వాటిలో ఒకటి స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అయ్యిపోయిందట. ఆ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఉండబోతుందని దిల్ రాజు తెలియజేసారు. 2025లోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది.