Rashmika-Vijay Deverakonda
Rashmika-Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎప్పటికీ ది బెస్ట్ అంటూ నటి రష్మిక మందన్న(Rashmika) ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. సడెన్‌గా రష్మిక కు విజయ్ ఎందుకు గుర్తుకు వచ్చాడంటే..?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి చిత్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న’యానిమల్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. నేడు (సెప్టెంబర్ 28న) రణ్‌బీర్ కపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. కాగా.. టీజర్ తనకు ఎంతో నచ్చిందని విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. “మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక.. అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఆల్ ది బెస్ట్.” అని విజయ్ అన్నాడు
విజయ్ చేసిన ట్వీట్ పై రష్మిక రిప్లై ఇచ్చింది. ‘ధన్యవాదాలు విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్… ‘అంటూ రాసుకొచ్చింది. కాగా.. ఇప్పుడు రష్మిక చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Thankyouuuuuuu @TheDeverakonda ?❤️
You be the bestestestestttt! ❤️ https://t.co/vz9MCFhsiA— Rashmika Mandanna (@iamRashmika) September 28, 2023
ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తామిద్దరం మంచి స్నేహితులమే తప్ప ఇంకేం కాదని గతంలో వీరిద్దరు చెప్పారు. అయినప్పటికీ రూమర్లు ఆగడం లేదు.