Vijay Deverakonda Kingdom Movi First Day Collection
హీరో విజయ్ దేవరకొండ నటించిన మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నిన్న (జూలై 31న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను సాధించింది.
తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. రాజు రాక విధ్వంసం సృష్టించింది అంటూ ఆ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఇక విజయ్ దేవరకొండ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు ఇవే
The King’s arrival has created havoc 🔥
𝗢𝗻 𝗮 𝗻𝗼𝗻 𝗵𝗼𝗹𝗶𝗱𝗮𝘆 𝗧𝗵𝘂𝗿𝘀𝗱𝗮𝘆 𝗿𝗲𝗹𝗲𝗮𝘀𝗲, 𝗗𝗮𝘆 𝟭 𝗪𝗼𝗿𝗹𝗱𝘄𝗶𝗱𝗲 𝗚𝗿𝗼𝘀𝘀 𝗶𝘀 ~ 𝟯𝟵 𝗖𝗿𝗼𝗿𝗲𝘀+ 💥💥
A true display of the hysteria created among the audience ❤️🔥❤️🔥#BoxOfficeBlockbusterKingdom… pic.twitter.com/JsF8qidrrx
— Sithara Entertainments (@SitharaEnts) August 1, 2025
పాటిజివ్ టాక్ రావడం, ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో ఈ చిత్రం ఈ మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ దాటేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రల్లో నటించారు.