×
Ad

Kushi : మణిరత్నం ‘సఖి’ రిఫరెన్స్‌తోనే విజయ్ ‘ఖుషి’ తెరకెక్కిందా..? శివ నిర్వాణ కామెంట్స్..!

మణిరత్నం 'సఖి' సినిమాకి విజయ్ దేవరకొండ 'ఖుషి'కి సంబంధం ఉందా..? దర్శకుడు శివ నిర్వాణ ఏం చెప్పాడు..?

  • Published On : August 27, 2023 / 04:02 PM IST

Vijay Deverakonda Kushi maniratnam sakhi reference shiva nirvana comments

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే విజయ్, సామ్, శివ నిర్వాణ, వెన్నల కిశోర్ కలిసి యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఎమోషన్ ట్వీట్.. ‘అది నా పిల్ల’..!

కాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నెట్టింట ఒక చర్చ జరుగుతుంది. ఈ సినిమా మణిరత్నం సూపర్ హిట్ మూవీ ‘సఖి’ రిఫరెన్స్‌తో రాబోతోందా..? అనే క్యూస్షన్స్ వినబడుతున్నాయి. తాజాగా దీని గురించి దర్శకుడు శివ నిర్వాణను ప్రశ్నించగా, తను బదులిస్తూ.. “పెళ్లి తరువాత ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద సినిమా తీయాలని అనుకున్నాను. ఇక ప్రేమ పెళ్లి అన్నప్పుడు ఏమి ఉంటుంది. రిజిస్టర్ మ్యారేజ్, ఫ్యామిలీ నుంచి విడిపోయి ఇద్దరు దూరంగా బ్రతకడం అనేది ప్రతి ఒక్కరు కథలో జరిగేది. సాధారణంగా చాలా సినిమాలో ఈ విషయాలు అన్ని ఒక సాంగ్ లో ఫాస్ట్ గా చూపించేస్తారు. అయితే సఖి సినిమాలో ఆ సాంగ్ నే కథగా తీసుకున్నారు. ఇప్పుడు మేము ఆ పాటనే కథగా తీసుకున్నాము కాబట్టి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ మా సినిమా దానికి ఎటువంటి సంబంధం లేదు” అని వెల్లడించాడు.

Allu Arjun : నా భార్యకు సినిమాల గురించి తెలియదు.. నేషనల్ అవార్డు వచ్చాక స్నేహ ఎలా స్పందించింది?

సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. మరి విజయ్ కి ‘లైగర్’తో మిస్ అయిన పాన్ ఇండియా హిట్ ని ఖుషి అందిస్తుందా? లేదా? చూడాలి.