×
Ad

Vijay Deverakonda : మహేష్, ప్రభాస్‌తో పోటీకి విజయ్ దేవరకొండ.. పరశురాంతో సినిమా సంక్రాంతికి..?

2024 లో సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్, ప్రభాస్, రవితేజ ఉండగా.. ఇప్పుడు ఆ బరిలోకి పందెం కోడిలా విజయ్ దేవరకొండ కూడా దూకుతా అంటున్నాడు.

  • Published On : June 21, 2023 / 06:23 PM IST

Vijay Deverakonda Parasuram movie in summer race with mahesh prabhas movies

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం (Parasuram) కలయికలో వచ్చిన ‘గీతగోవిందం’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రం విజయ్ కెరీర్ లో మొదటి 100 కోట్లు తెచ్చిపెట్టిన సినిమా. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించబోతుంది.

Adipurush : బాక్సాఫీస్‌ వద్ద 78 శాతం ఆదిపురుష్ కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయి..

ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రీకరణ కూడా మొదలు పెట్టుకోనుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తీ చేసేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు రావడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాతో దిల్ రాజు సంక్రాంతికి రావాల్సి ఉంది. కానీ అది 2024 సమ్మర్ కి పోస్ట్‌పోన్ అయ్యినట్లు సమాచారం. దీంతో విజయ్ సినిమాని సంక్రాంతి బరిలో పెట్టాలని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు.

Salaar : సలార్ సినిమా KGFని మించి ఉంటుంది.. అదో కొత్త ప్రపంచం.. సలార్ పై శ్రియ రెడ్డి కామెంట్స్..

అయితే 2024 సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Karam), ప్రభాస్ Project K చిత్రాలు ఉన్నాయి. అలాగే రవితేజ ఈగల్ (Eagle) సినిమా కూడా సంక్రాంతికే వస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ ఉండనుందని తెలుస్తుంది. ప్రాజెక్ట్ K అండ్ ఈగల్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్స్ గా రాబోతుంటే గుంటూరు కారం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఒకవేళ విజయ్ సంక్రాంతికి వస్తే.. ఈ చిత్రాలకు ఎటువంటి పోటీ ఇస్తాడో చూడాలి.