Vijay Deverakonda : నాన్నగా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ..? పిక్ వైరల్..!

విజయ్ దేవరకొండ, పరుశురామ్ కలయికలో వస్తున్న సినిమాలో విజయ్ తండ్రిగా కనిపించబోతున్నాడా..? ఫోటో వైరల్ అవుతుంది.

Vijay Deverakonda : నాన్నగా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ..? పిక్ వైరల్..!

Vijay Deverakonda playing a father role in VD13 movie

Updated On : October 15, 2023 / 2:51 PM IST

Vijay Deverakonda : గీతగోవిందం లాంటి హిట్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ, పరుశురామ్ కలిసి చేస్తున్న సినిమా VD13. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే లాంచ్ అయ్యి షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీకి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ గురించి అప్డేట్ ఇచ్చారు.

అక్టోబర్ 18 సాయంత్రం 6:30 నిమిషాలకు ఈ మూవీకి నామకరణం చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఒక చిన్న టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ అప్డేట్ ఇస్తూ.. ఒక ఫోటోని కూడా రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు విజయ్ దేవరకొండ.. ఒక పాపని స్కూల్ కి తీసుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇది చూసిన అభిమానులు.. ఏంటి విజయ్ ఈ సినిమాలో తండ్రిగా నటించబోతున్నాడా..? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి విజయ్ ఏ పాత్ర చేస్తున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also read : Prabhas : మారుతి సినిమా నుంచి ప్రభాస్ కొత్త ఫోటోలు లీక్.. వింటేజ్ లుక్‌లోకి వచ్చేశాడుగా..

ఇక టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారట. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకరటించారు. అయితే కచ్చితమైన డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం. కాగా అదే డేట్ లో వెంకటేష్ ‘సైంధవ్‌’, ర‌వితేజ ‘ఈగ‌ల్‌’ రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఒక రోజు ముందుగా మ‌హేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజా సజ్జా ‘హ‌నుమాన్‌’ థియేటర్స్ లోకి రాబోతున్నాయి.