Ranabaali : ‘రణబాలి’ రణభేరి.. రాయలసీమ గడ్డ మీద సక్సెస్ మీట్.. ఎప్పుడు? ఎక్కడ?
ఇప్పటికే ఈ సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. (Ranabaali)
- Saketh U
- Published on- October 22, 2026 / 04:25 PM IST
Ranabaali
Ranabaali : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట ఇటీవల దసరా పండగకు రణబాలి సినిమాలో వచ్చి మంచి విజయం సాధించారు. స్వతంత్రం ముందు రాయలసీమ ప్రాంతంలో జరిగిన కరువు, బ్రిటిష్ అరాచకాల నేపథ్యంలో పీరియాడిక్ కథగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది.
రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత భారీ ప్రమోషన్స్ నిర్వహించిన రణబాలి టీమ్ ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. రణబాలి రణభేరి పేరిట ఈ సక్సెస్ మీట్ ని అక్టోబర్ 23న అనంతపూర్ లోని రాప్తాడు రోడ్ లోని హార్మోని సిటీలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ విషయం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
Also Read : Megastar Chiranjeevi : కాకా? విశ్వంభర? సంక్రాంతికి ఏ సినిమా వస్తుంది బాసు..?
దీంతో రేపు రణభేరి సక్సెస్ మీట్ కి అనంతపూర్ లో ఫ్యాన్స్, ప్రేక్షకులు భారీగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. రాయలసీమ ప్రజలు, ప్రముఖులు ఈ ఈవెంట్ కి భారీగా వస్తారని అంచనా. రణబాలి రణభేరిని గ్రాండ్ గా నిర్వహించనున్నారు మూవీ యూనిట్.
