Vijay Deverakonda : నాకు ఆ విషయంలో భయం.. అందుకే మొదట్లో అగ్రెసివ్ గా మాట్లాడాను.. కానీ ఇప్పుడు..

కానీ ఇటీవల ఆ అగ్రెసివ్ కాస్త తగ్గింది. నిదానంగా ఆలోచించి మాట్లాడుతున్నాడు.

Vijay Deverakonda

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ తన సినిమాల కంటే స్పీచ్ లతోనే ఎక్కువ వైరల్ అవుతాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి తన స్పీచ్ లు, ఇంటర్వ్యూలలో అగ్రెసివ్ గా, ఆవేశంగా మాట్లాడేవాడు. విజయ్ స్పీచ్ ల మీద, అతని మాట్లాడే తీరు మీద విమర్శలు కూడా బాగా వచ్చాయి. కానీ ఇటీవల ఆ అగ్రెసివ్ కాస్త తగ్గింది. నిదానంగా ఆలోచించి మాట్లాడుతున్నాడు.

విజయ్ కి వరుసగా కొన్ని ఫ్లాప్స్ పడటంతో ఇలా నెమ్మదించాడు, లేకపోతే ఫైర్ అవుతాడు విజయ్ అని కూడా ఇటీవల విమర్శలు చేసారు. తాజాగా కింగ్డమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో విజయ్ ని దీనిపై ప్రశ్నించగా సమాధానమిచ్చాడు.

Also Read : Kingdom Press Meet : ‘కింగ్డమ్’ ప్రెస్ మీట్ ఫొటోలు..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను మనసులో అనిపించింది మాట్లాడతా. మొదట్లో కొంచెం ఆగ్రెషన్ ఉంటుంది. ఎవరూ మనల్ని ఏమి అనకూడదు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా గురించి ఎవరూ తక్కువ మాట్లాడొద్దు, నేను సాధించాలి అని అగ్రెసివ్ ఉండేది. తర్వాత కొంత సాఫ్ట్ అయ్యాను. ప్రజల లవ్ వల్ల సాఫ్ట్ అయ్యాను. మనల్ని ఎవరు ఏం చేస్తారు అనే ఆ భయం ఇప్పుడు పోయింది. నాకు ఎవరూ లేరు ఇండస్రీలో అందుకే నన్ను ఎవరు ఏం చేస్తారు అనే భయం ఉండేది. దాన్ని కవర్ చేసుకోడానికి అంత అగ్రెసివ్ గా ఉన్నాను. ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి మెచ్యూరిటీ పెరిగింది అని అన్నారు.

Also Read : Venkitesh : ‘కింగ్డమ్’ ఈవెంట్లో వైరల్ అయిన ఈ నటుడు తెలుసా? రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతూ స్టార్ గా ఎదిగి..