Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో జులై 31న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలు తెలిపాడు. ఈ క్రమంలో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
హోస్ట్ మీరు ఎంచుకునే కథల వల్ల కూడా ఫ్లాప్స్ వచ్చి ఉంటాయి, మీరు నెపో కిడ్ కాదు అని అడగ్గా విజయ్ దేవరకొండ దానికి సమాధానమిస్తూ.. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు. మనకు సపోర్ట్ సిస్టమ్ లేనప్పుడు డైరెక్టర్ కి స్క్రిప్ట్ నచ్చలేదు, ఈ స్క్రిప్ట్ తో షూటింగ్ చేయలేను, ఇంకా వర్క్ చేయి అని చెప్పలేను. నాకు తెలిసిన ఇంకో యాక్టర్ కి అతనికి కూడా నా అంత అనుభవమే ఉంటుంది. అతనికి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉంది. అతని తండ్రికి స్క్రిప్ట్ నచ్చకపోతే షూట్ కి వెళ్లొద్దు అంటారు. కావాలంటే ఇంకో ఇద్దరు రైటర్స్ ని ఇచ్చి స్క్రిప్ట్ మీద వర్క్ చేయమంటారు. అది నాకు లేదు. నేను అలా చెప్పలేకపోయేవాడ్ని. ఇటీవలే నేను అలా చెప్పడం నేర్చుకుంటున్నాను. నాకు కథ నచ్చకపోతే నిర్మాతలకు, దర్శకులకు చెప్తున్నాను. మీ డబ్బులు, డైరెక్టర్ కెరీర్, నా ఇమేజ్ అన్ని ఇంపార్టెంట్. నా కెరీర్ మొదట్లో అలా చేశాను. కానీ ఇపుడు నాకు స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను అని తెలిపారు.
అయితే విజయ్ దేవరకొండ అన్నది ఏ హీరో గురించి, ఏ హీరో తండ్రి స్క్రిప్ట్ చూసి సినిమా ఫైనల్ చేస్తాడు అని సోషల్ మీడియాలో చర్చగా మారింది.