Vijay Deverakonda : ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ కాశీ ట్రిప్.. అల్లు అర్జున్ భార్య కూడా వెళ్ళిందిగా.. ఆ డైరెక్టర్ కూడా.. ఫోటోలు వైరల్..

తాజాగా విజయ్ అధికారికంగా తన సోషల్ మీడియాలో తన కుంభమేళా ట్రిప్ ఫోటోలను షేర్ చేసాడు.

Vijay Deverakonda Shares Kashi Trip Photos with Allu Sneha Reddy and Others

Vijay Deverakonda : ఇటీవల విజయ్ దేవరకొండ తన తల్లి, మరి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయోగరాజ్ వెళ్ళాడు. విజయ్ దేవరకొండ కుంభమేళాలో స్నానం ఆచరించిన ఫోటోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ అధికారికంగా తన సోషల్ మీడియాలో తన కుంభమేళా ట్రిప్ ఫోటోలను షేర్ చేసాడు.

Also Read : Chiranjeevi – Venkatesh : 27 ఏళ్ళ క్రితమే చిరంజీవి – వెంకటేష్ భారీ మల్టీస్టారర్ ప్లాన్.. ఆ డైరెక్టర్ తో.. కానీ ఎందుకు అవ్వలేదు అంటే..?

విజయ్ దేవరకొండ తన తల్లి, తన ఫ్రెండ్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మరికొంతమందితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోలను షేర్ చేసి.. 2025 కుంభమేళా మన సాంస్కృతి సంప్రదాయాలను కనెక్ట్ చేసే ఒక ప్రయాణం. నా ఫ్రెండ్స్ తో కొన్ని జ్ఞాపకాలు చేసుకున్నాను. అమ్మతో కలిసి ప్రార్థనలు చేశాను. నా గ్యాంగ్ తో కలిసి కాశీకి కూడా ట్రిప్ వేసాను అని రాసుకొచ్చాడు.

దీంతో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే విజయ్ కాశి ట్రిప్ లో వంశీ పైడిపల్లి, అల్లు స్నేహారెడ్డి ఉండటంతో వీళ్ళు విజయ్ తో ఎలా వెళ్లారు, వీళ్ళు విజయ్ కి ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? బన్నీ కూడా వెళ్లాడా? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు స్నేహ రెడ్డి కూడా ఉండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసే స్నేహ ఈ ట్రిప్ ఫోటోలు మాత్రం ఇంకా షేర్ చేయలేదు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు.