Chiranjeevi – Venkatesh : 27 ఏళ్ళ క్రితమే చిరంజీవి – వెంకటేష్ భారీ మల్టీస్టారర్ ప్లాన్.. ఆ డైరెక్టర్ తో.. కానీ ఎందుకు అవ్వలేదు అంటే..?
చిరంజీవి - వెంకటేష్ కాంబోతో ఓ భారీ మల్టీస్టారర్ 27 ఏళ్ళ క్రితమే ప్లాన్ చేసారు.

Do You Know Chiranjeevi - Venkatesh Huge MultiStarrer Planned in 1998 Details Here
Chiranjeevi – Venkatesh : సినీ పరిశ్రమ తొలినాళ్లలో చాలా మంది హీరోలు మల్టీస్టారర్స్ చేసారు. తొలితరం హీరోలంతా మల్టీస్టారర్ సినిమాలు చేసి హిట్స్ కొట్టారు. కానీ హీరోలు – ఫ్యాన్ బేస్ – స్టార్ డమ్ పెరిగిన తర్వాత మల్టీస్టారర్స్ తగ్గిపోయాయి. ఎవరైనా మల్టీస్టారర్ చేస్తే మా హీరో గ్రేట్, మా హీరో గ్రేట్ అని కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో మల్టీస్టారర్ సినిమాలు ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్స్ వస్తున్నా ఇప్పుడు కూడా ఫ్యాన్స్ మా హీరో – మా హీరో అని కొట్టుకుంటున్నారు.
సీనియర్ హీరోలు అంతా కలిసి కనిపిస్తే సినిమా లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి – నాగార్జున – బాలకృష్ణ – వెంకటేష్ వీరిలో ఎవరైనా కలిసి మల్టీస్టారర్స్ చేస్తే బాగుండు అని అనుకుంటారు ఫ్యాన్స్. గతంలో వెంకటేష్ త్రిమూర్తులు సినిమాలో మాత్రం అందరు హీరోలు జస్ట్ అలా కనిపించి వెళ్తారు. ఇటీవలే వెంకటేష్ 75 సినిమాల ఈవెంట్లో వెంకటేష్ – చిరంజీవి మల్టీస్టారర్ గురించి టాపిక్ వస్తే వెంకిమామ మాట్లాడుతూ.. చిరంజీవి గారు అలా ముందు వెళ్తుంటే నేను వెనక కత్తి పట్టుకొని బాడీగార్డ్ లా నడిచే క్యారెక్టర్ చేయాలి ఆయనతో అని అన్నారు.
అలాగే ఇటీవల బాలయ్య 50 ఇయర్స్ నట జీవితం ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. నేను, బాలయ్య కలిసి మంచి మాస్ సినిమా చేయాలి ఎవరైనా రచయితలు కథ రాయండి అని అన్నారు. దీంతో సీనియర్ హీరోలు కూడా కలిసి చేయడానికి ఆసక్తి చూపుతున్నా ఫ్యాన్స్ నొచ్చుకోకుండా ఉండేలా ఒక మంచి కథ కోసం చూస్తున్నారు. అయితే చిరంజీవి – వెంకటేష్ కాంబోతో ఓ భారీ మల్టీస్టారర్ 27 ఏళ్ళ క్రితమే ప్లాన్ చేసారు.
Also Read : Pawan Kalyan : పవన్ వాడే చెప్పులు అన్నీ కుట్టేది ఈయనే.. పర్సనల్, సినిమాలకు.. ఈయన కోసం పవన్ ఏం చేశారో తెలుసా?
దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో 100వ సినిమాని భారీగా చేయాలని వెంకటేష్ – చిరంజీవి లతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేయాలని 1998లోనే అనుకున్నారు. అప్పటికే 96 సినిమాలు చేసి ఉండటంతో 100వ సినిమా స్పెషల్ గా ప్లాన్ చేయాలని అనుకున్నారు. అప్పటి స్టార్ డైరెక్టర్ అయిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు వెంకటేష్ – చిరంజీవి సినిమా బాధ్యతలు అప్పగించారు. దీని గురించి అధికారికంగా కూడా అనౌన్స్ చేసేసారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఈవీవీతో పాటు మరో ఇద్దరు రచయితలు కూర్చొని చిరు – వెంకటేష్ స్టార్ డమ్ లకు తగ్గట్టు కథ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అనుకున్నట్టు కథ రాకపోవడంతో, నిర్మాత రామానాయుడికి కథ నచ్చకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.
లేదంటే అప్పట్లోనే చిరంజీవి – వెంకటేష్ కాంబోలో భారీ మల్టీస్టారర్ వచ్చేది. ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు ఇప్పటికి కూడా ఇంకా తీరలేదు. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నా సీనియర్ స్టార్ హీరోలు కలిసి మల్లీస్టారర్స్ ఎప్పుడు చేస్తారో చూడాలి.