Sudigali Sudheer : మూడు రోజుల నుంచి సుధీర్ హాస్పిటల్ లోనే.. ఆరోగ్యం బాగోకపోయినా ఈవెంట్ కి.. ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన..

తాజాగా చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్ కు వచ్చాడు సుధీర్.

Sudigali Sudheer : మూడు రోజుల నుంచి సుధీర్ హాస్పిటల్ లోనే.. ఆరోగ్యం బాగోకపోయినా ఈవెంట్ కి.. ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన..

Dhanaraj Says Sudigali Sudheer Effected with Health Issues and Hospitalized from Past 3 Days

Updated On : February 17, 2025 / 12:42 PM IST

Sudigali Sudheer : మెజీషియన్ గా మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్ జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి అదే షోలో టీమ్ లీడర్ గా ఎదిగి బాగా పాపులర్ అయ్యాడు. తన టీవీ షోలు, కామెడీ, ట్యాలెంట్ తో ఆల్మోస్ట్ హీరోలకు ఉన్నంత క్రేజ్, ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేయగా త్వరలో గోట్ అనే సినిమాతో రానున్నాడు.

ప్రస్తుతం టీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో చేస్తున్నాడు సుధీర్. ఆ షోలో తప్ప బయట మీడియాకు, సినిమా ఈవెంట్స్ లో కనపడి చాలా రోజులైంది. అయితే తాజాగా చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్ కు వచ్చాడు సుధీర్. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రామం రాఘవం సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. సముద్రఖని కీలకపాత్రలో తండ్రీకొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read : Pawan Kalyan : పవన్ వాడే చెప్పులు అన్నీ కుట్టేది ఈయనే.. పర్సనల్, సినిమాలకు.. ఈయన కోసం పవన్ ఏం చేశారో తెలుసా?

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ కు సుధీర్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో సుధీర్ మాట్లాడిన తర్వాత ధనరాజ్ మాట్లాడుతూ.. సుధీర్ కి హెల్త్ బాగోలేదు. డైరెక్ట్ హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. మూడు రోజుల నుంచి తనకి మాట్లాడటానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే వస్తాను అని చెప్పాడు. ఆరోగ్యం బాగోకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్ళల్లో సుధీర్ ముందు ఉంటాడు. చాలా మొహమాటం సుధీర్ కి. అతని ఫంక్షన్స్ కి వెళ్ళడానికే ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాడు అని అన్నారు.

దీంతో ధనరాజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాట్లాడటం కూడా కష్టం అయ్యేలా సుధీర్ కి ఏమైంది? మూడు రోజులుగా సుధీర్ హాస్పిటల్ లో ఎందుకున్నాడు? సుధీర్ కి ఏమైంది? సుధీర్ హెల్త్ సమస్య ఏంటి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సుధీర్ కానీ, ధనరాజ్ కానీ క్లారిటీ ఇస్తారా చూడాలి. ఫ్యాన్స్ మాత్రం సుధీర్ కి ఏమైంది అని ఆందోళన చెందుతున్నారు.

Also Read : Prabhas – Manchu Vishnu : మంచు విష్ణు కోసం ప్రభాస్ ఫ్రీగా.. మరి ప్రభాస్ కోసం మంచు విష్ణు ఫ్రీగా చేస్తాడా?

ఇక సుధీర్ హీరోగా ప్రస్తుతం G.O.A.T(Greatest Of All Times) అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ భామ దివ్య భారతి హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Dhanaraj Says Sudigali Sudheer Effected with Health Issues and Hospitalized from Past 3 Days