Pawan Kalyan : పవన్ వాడే చెప్పులు అన్నీ కుట్టేది ఈయనే.. పర్సనల్, సినిమాలకు.. ఈయన కోసం పవన్ ఏం చేశారో తెలుసా?

పవన్ చెప్పులు తయారుచేసేది ఎవరు అంటూ మరోసారి వైరల్ గా మారింది.

Pawan Kalyan : పవన్ వాడే చెప్పులు అన్నీ కుట్టేది ఈయనే.. పర్సనల్, సినిమాలకు.. ఈయన కోసం పవన్ ఏం చేశారో తెలుసా?

Do You Know About Pawan Kalyan Chappal Maker Tenali Venkateswararao Details Here

Updated On : February 17, 2025 / 11:58 AM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన చేతిలో ఉన్న శాఖల్లో పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఏపీ పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్నారు. రెగ్యులర్ గా పవన్ తన అభివృద్ధి కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సినిమాల పరంగా, ఆయన క్రేజ్ పరంగా కూడా రోజు వైరల్ అవుతూ ఉంటారు పవన్ కళ్యాణ్.

ఇటీవల పవన్ కళ్యాణ్ నార్మల్ పారగాన్ లాంటి చెప్పులు వేసుకొని కనిపించరు. పవన్ కేరళ, తమిళనాడు పుణ్యక్షేత్రాల ప్రదర్శనకు ఆ సింపుల్ చెప్పులు వేసుకెళ్లడంతో అవి వైరల్ గా మారాయి. స్టార్స్, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఖరీదైన చెప్పులు, షూస్ వాడతారు కానీ పవన్ మాత్రం ఇలా సింపుల్ గా ఉంటాడని ఫ్యాన్స్ పొగుడుతున్నారు. దీంతో పవన్ చెప్పులు తయారుచేసేది ఎవరు అంటూ మరోసారి వైరల్ గా మారింది.

Also Read : Return of The Dragon : లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

పవన్ కళ్యాణ్ కి చెప్పులు తయారుచేసేది తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి. వీళ్ళ తాత తండ్రుల నుంచి చెప్పులు కుట్టే వృత్తి, చెప్పులు అమ్మడం చేస్తూ వస్తున్నారు. ఓ డిజైనర్ ఈయన పనితనం చూసి సినీ పరిశ్రమలోకి తీసుకెళ్లింది. సినీ పరిశ్రమలో పలు సినిమాలలో హీరోలకు, కొంతమంది ఆర్టిస్టులకు ఈయన చెప్పులు తయారు చేయడం మొదలుపెట్టారు. అలా ఓ సారి కాటమ రాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు చెప్పులు కుట్టే అవకాశం వచ్చింది.

ఆ సినిమాలో పవన్ కి కుట్టిన చెప్పులు నాణ్యతగా, మంచిగా ఉండి పవన్ కు నచ్చడంతో పవన్ ఈయన్ని పిలిచి మాట్లాడారు. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలలో పవన్ కు వెంకటేశ్వరరావు చెప్పులు తయారుచేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పర్సనల్ గా కూడా వాడే చెప్పులు వెంకటేశ్వరరావు తయారుచేస్తున్నారు. గతంలో ఓ బహిరంగ సభలో వెంకటేశ్వరావు, అతని భార్యని పిలిచి సన్మానించి వీరికి లక్ష రూపాయల ఆర్ధిక సహకారం కూడా చేసారు పవన్.

Also Read : Prabhas – Manchu Vishnu : మంచు విష్ణు కోసం ప్రభాస్ ఫ్రీగా.. మరి ప్రభాస్ కోసం మంచు విష్ణు ఫ్రీగా చేస్తాడా?

అప్పుడు పవన్ మాట్లాడుతూ.. నేను అందరిలా వేరే దేశాల బ్రాండెడ్ చెప్పులు వాడను. మన తెనాలి బ్రాండ్ వెంకటేశ్వరరావు గారు తయారు చేసిన చెప్పులే వాడతాను అని అన్నారు. పవన్ కళ్యాణ్ కి చెప్పులు చేయడం, ఆయన సహాయం చేయడంపై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సినిమాల్లో చాలా మంది హీరోలకు నేను చెప్పులు చేశాను. పవన్ కళ్యాణ్ గారికి కాటమ రాయుడు సినిమా నుంచి చేస్తున్నాను. ఆయన గౌరవంగా పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని మంచిగా మాట్లాడతారు. అలా ఎవ్వరూ మాట్లాడలేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. ఆయనకు నేను తయారుచేసే చెప్పులు నచ్చుతాయి. నాకు లక్ష రూపాయలు సహాయం కూడా చేస్తే తెనాలిలో నా షాప్ కి ఉపయోగపడ్డాయి. ఆయన మమ్మల్ని గుర్తుంచుకొని మాట్లాడటం, సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. దీంతో మరోసారి పవన్ ఫ్యాన్స్ ఇది కదా పవన్ అంటే.. మంచి వాళ్ళు, మంచి పనితనం ఉంటె దగ్గరకు తీసుకుంటారు అనడానికి నిదర్శనం ఇదే అని అభినందిస్తున్నారు.

Do You Know About Pawan Kalyan Chappal Maker Tenali Venkateswararao Details Here