Vijay Deverakonda : విజయ్ వల్ల పూజా హెగ్డేకి మూవీ మిస్.. మరో ఆఫర్‌తో అందుకునే ప్రయత్నం..
తన వల్ల పూజా హెగ్డేకి ఒక మూవీ మిస్ అయ్యిందని విజయ్ దేవరకొండ.. ఆమెకు మరో సినిమా ఆఫర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
- gum 95921
- Published On : June 12, 2023 / 03:02 PM IST
Vijay Deverakonda suggest a Pooja Hegde to dil raju and parasuram for his movie
Vijay Deverakonda – Pooja Hegde : విజయ్ దేవరకొండ, పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ లైగర్ (Liger). పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం తరువాత విజయ్, పూరీ దర్శకత్వంలోనే ‘జనగణమన’ సినిమా కూడా చేయాల్సి ఉంది. ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ కూడా చేశారు. కానీ లైగర్ రిజల్ట్ తో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఆ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డేని సెలెక్ట్ చేసుకున్నారు.
ఇక ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో పూజా చేతి నుంచి ఒక సినిమా పోయింది. అయితే విజయ్ మాత్రమే.. తన నిర్ణయం వలనే పూజాకి ఒక సినిమా అవకాశం మిస్ అయ్యిందని మనసులో పెట్టుకున్నాడు. అందుకనే తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా పూజాని తీసుకోమని దర్శకనిర్మాతలకు రిక్వెస్ట్ పెట్టినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. విజయ్ తనకి ‘గీతగోవిందం’ వంటి సూపర్ హిట్ అందించిన పరుశురాంతో కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
Adipurush : ఆదిపురుష్ మరింతమందికి చేరువవ్వడానికి.. ప్రతి రామాలయానికి 101 ఆదిపురుష్ టికెట్లు ఫ్రీ..
సూపర్ హిట్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకోవాలని దిల్ రాజు అండ్ పరుశురాంని విజయ్ కోరాడట. ప్రస్తుతం పూజా ప్లాప్ ల్లో ఉంది. ప్రస్తుతానికి ఆమె చేతిలో మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Karam) సినిమా తప్ప మరో మూవీ లేదు. మరి విజయ్ కోరిక మేరకు పూజాని తీసుకుంటారా? లేదా? చూడాలి. అయితే పూజాకి ఛాన్స్ ఇవ్వాలన్న విజయ్ నిర్ణయాన్ని అభిమానులు అభినందిస్తున్నారు.
