Adipurush : ఆదిపురుష్ మరింతమందికి చేరువవ్వడానికి.. ప్రతి రామాలయానికి 101 ఆదిపురుష్ టికెట్లు ఫ్రీ..
ఇటీవల ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ఫ్రీగా ఆదిపురుష్ చూపిస్తాను, అందుకోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తున్నాను అని ప్రకటించారు. మరో వైపు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తాను అని తెలిపాడు. ఇప్పుడు ఇదే తరహాలో.............

adipurush movie 101 free tickets to one ramalayam in every village of khammam district by shreyas media
Adipurush Movie : ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) మెయిన్ లీడ్స్ లో రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). జూన్ 16న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులే కాక దేశమంతటా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తుండగా పలువురు ప్రముఖులు కూడా ముందుకొచ్చి వారి రీతిలో సినిమాని ప్రమోట్ చేసి ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ఫ్రీగా ఆదిపురుష్ చూపిస్తాను, అందుకోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తున్నాను అని ప్రకటించారు. మరో వైపు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తాను అని తెలిపాడు. రామ్ చరణ్ కూడా కొంతమందికి ఫ్రీగా ఆదిపురుష్ సినిమా చూపించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
ఇప్పుడు ఇదే తరహాలో ఈ సినిమాను మరింతమందికి చేరువచేయడానికి మరొకరు ముందుకొచ్చారు. సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ పేరు సంపాదించిన శ్రేయాస్ మీడియా, దాని అధినేత శ్రీనివాస్ ఓ నిర్ణయం తీసుకున్నారు. తన ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి 101 టికెట్స్ ఆదిపురుష్ సినిమా కోసం ఫ్రీగా ఇస్తానని ప్రకటించారు.ఇటీవల చిత్రయూనిట్ ప్రతి థియేటర్లో ఆంజనేయ స్వామికి ఒక సీట్ ఉంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సీట్ తో పాటు మరో 100 టికెట్లు బుక్ చేసి ఖమ్మం జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలో ఒక రామాలయానికి ఇస్తామని, ఆ రామాలయంకు చెందిన సభ్యులు, వచ్చే భక్తులు ఆదిపురుష్ సినిమాను ఫ్రీగా చూడొచ్చని ప్రకటించారు. దీంతో రామ భక్తులు మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు.