Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన టీజర్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు విజయ్.
Alao Read : Samantha : అమెరికా వెకేషన్ లో సమంత.. ఫొటోలు చూశారా?
ఈ క్రమంలో లైఫ్ లో తన కష్టాల గురించి చెప్తూ.. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను బోర్డింగ్ స్కూల్ లో వేశారు. అలా అయిదేళ్ల నుంచే నేను అమ్మ నాన్న లేకుండా బతకడం నేర్చుకున్నాను. నేను ఫస్ట్ టైం గొడవ పడ్డప్పుడు అవతలి వ్యక్తికంటే తక్కువ దెబ్బలతో వచ్చాను. నాకు సమస్యలు వచ్చినప్పుడు మా నాన్నను తీసుకెళ్లకుండా నేనే ఎదుర్కొన్నాను. నా కెరీర్ లో కూడా నేను ఎలాంటి గైడెన్స్ లేకుండా నా కాళ్ళమీద నేను నిలబడ్డాను అని తెలిపాడు. విజయ్ దేవరకొండ చిన్నప్పట్నుంచి పుట్టపర్తి శ్రీ సత్యసాయి స్కూల్ లో అక్కడే హాస్టల్ లో ఉండి చదువుకున్న సంగతి తెలిసిందే.
Also Read : Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో అమెరికాలో సమంత.. భుజంపై చెయ్యి వేసి.. రాజ్ – సమంత క్లోజ్ ఫోటో వైరల్..