రూ.500లు లేవని అకౌంట్ లాక్ చేసారు-కట్ చేస్తే..

019 ఫోర్బ్స్ ఇండియా '30 అండర్ 30' లో ప్లేస్ దక్కించుకున్నసందర్భంగా విజయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 09:55 AM IST
రూ.500లు లేవని అకౌంట్ లాక్ చేసారు-కట్ చేస్తే..

Updated On : February 5, 2019 / 9:55 AM IST

019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో ప్లేస్ దక్కించుకున్నసందర్భంగా విజయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సాధించాడు. 2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో, విజయ్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా విజయ్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే.. నాకు 25 ఇయర్స్ అప్పుడు, నా ఆంధ్రాబ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.500లు మెయిన్‌టెన్ చెయ్యలేదని నా అకౌంట్ లాక్ చేసారు.

అప్పుడు మా నాన్న.. 30 ఇయర్స్ వచ్చేలోపే సెటిల్ అవ్వాలి.. పేరెంట్స్ హెల్దీగా ఉన్నప్పుడు, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడే సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యగలవని చెప్పారు. కట్ చేస్తే, నాలుగేళ్ళ తర్వాత 2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో ప్లేస్ పొందాను.. అంటూ, భావోద్వేగంతో ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ. విజయ్ ట్వీట్‌ని అతని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.