Vijay Deverakonda : నేనే ఇంకా సినిమా చూడలేదు.. నేను థియేటర్ కి వెళ్లాలంటే భయపెడుతున్నారు..

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

Vijay Deverakonda

Vijay Deverakonda : నేడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత విజయ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేనే ఇంకా సినిమా చూడలేదు. మీరంతా చూసాక రేపు లేదా ఎల్లుండి చూస్తాను. నేను థియేటర్ కి వెళ్లి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. కానీ నన్ను చూడనివ్వట్లేదు. థియేటర్ కి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి అని భయపెడుతున్నారు అని తెలిపాడు.

Also Read : Nara Rohith – Siree Lella : రెండేళ్ల ప్రేమ.. లవ్ యానివర్సరీ.. గర్ల్ ఫ్రెండ్ తో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నారా రోహిత్..

గత సంవత్సరం డిసెంబర్ లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన పుష్ప 2 సంఘటన తర్వాత సినిమాలు, సెలబ్రిటీలు విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. హీరోలు ఎవరైనా థియేటర్స్ కి రావాలంటే కచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉండాల్సిందే. ఈ క్రమంలోనే విజయ్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడటానికి ఇంకా పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదని, అందుకే థియేటర్ కి వెళ్లి చూడలేదని తెలుస్తుంది. రెండు రోజుల్లో పర్మిషన్ వచ్చి విజయ్ థియేటర్ కి వెళ్లి కింగ్డమ్ సినిమా చూసే అవకాశం ఉంది.