Vijay Deverakonda : సందీప్ రెడ్డి వంగ సినిమా కోసం వస్తున్న విజయ్ దేవరకొండ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసారు.(Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా తన స్టైల్ సినిమాలు తీయడమే కాకుండా నిర్మాతగా మారి వేరే సినిమాలు తీయడం కూడా మొదలుపెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా ‘రోమాంచకం’ అనే సినిమాని తెరకెక్కించారు. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇప్పటికే రోమాంచకం సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. లవ్ కామెడీ జానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసారు.
Also See : Saanve Megghana : మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. శాన్వి మేఘన ఫొటోలు..
రోమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఆగస్టు 30న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఈ ఈవెంట్ కి మూవీ టీమ్, సందీప్ రెడ్డి వంగ కూడా హాజరు అవుతుండగా విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరు అవుతున్నాడు.
విజయ్ కెరీర్ ని మలుపు తిప్పిన అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తీసి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి సందీప్ – విజయ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు సందీప్ ఓ చిన్న సినిమా నిర్మిస్తుంటే విజయ్ ఆ సినిమా ప్రమోషన్స్ కి హాజరవుతున్నాడు. దీంతో రోమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also See : Vishnu Priya Bhimeneni : బాబోయ్.. బాల్కనీలో జిమ్ డ్రెస్‌తో విష్ణుప్రియ బోల్డ్ పోజులు..
