వరల్డ్ ఫేమస్ లవర్ – ఫస్ట్ లుక్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్‌లుక్ రిలీజ్..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్‌లుక్ రిలీజ్..
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్‌ల కాంబినేషన్‌లో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover)..
రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా, ఐశ్వర్య రాజేష్, ఎజిబెల్లా, క్యాథరీన్ మరో ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ముఖం మీద గాయాలతో, నోట్లో నుండి ధారాళంగా పొగ వదులుతూ.. రెండు వేళ్లతో సిగరెట్ విసిరేస్తున్న విజయ్ రగ్గడ్ లుక్ అదిరిపోయింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు టైటిల్స్‌తో రెండు పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.
ఇది విజయ్ నటిస్తున్న 9వ సినిమా, క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 46వ సినిమా కావడం విశేషం. కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.
First Look.#WorldFamousLover#WFLFirstLook pic.twitter.com/41li0tdkzE
— Vijay Deverakonda (@TheDeverakonda) September 20, 2019