Vijay Leo : విజయ్ ‘లియో’ సినిమా కలెక్షన్స్ ఫేక్.. సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్..

విజయ్ లియో సినిమా మొదటి రోజే 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించి. ఆ తర్వాత వారం రోజుల్లో లియో సినిమా 461 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వారం రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది అని ప్రకటించారు.

Vijay Leo Movie Collections are Fake said by Tamilnadu Theaters Association president

Vijay Leo : లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్ హీరోగా ఇటీవల దసరాకు లియో సినిమా రిలీజయింది. లోకేష్ సినిమాలపై హైప్ ఉండటంతో, ఈ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. అయితే లియో సినిమా రిలీజ్ అయ్యాక తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా మిగిలిన ప్లేస్ లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. విజయ్ అభిమానులని లియో సినిమా సంతృప్తి పరిచినా.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులని మాత్రం నిరుత్సాహపరిచింది.

అయితే విజయ్ లియో సినిమా మొదటి రోజే 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించి. ఆ తర్వాత వారం రోజుల్లో లియో సినిమా 461 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వారం రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది అని ప్రకటించారు. చిత్రయూనిట్ ఇలాగే భారీ కలెక్షన్స్ వస్తున్నట్టు లియో ప్రమోషన్స్ చేస్తుంది.

Also Read : Ranveer Deepika : నిశ్చితార్థం చేసుకొని మూడేళ్లు సీక్రెట్ గా.. కాఫీ విత్ కరణ్ లో బోలెడన్ని సీక్రెట్స్ చెప్పిన దీపికా రణవీర్..

అయితే తాజాగా తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం లియో సినిమా కలెక్షన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిరుపూర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. లియో సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్. నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారు. తమిళనాడు థియేటర్స్ కి అయితే లాభాలు రాలేదు. నిర్మాత లలిత్ కుమార్ 5 కోట్లు ఖర్చుపెట్టి ఫేక్ బుకింగ్స్, ప్రమోషన్స్ చేయిస్తున్నారు. తప్పుడు కలెక్షన్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా పలువురు విజయ్ అభిమానులు అతనిపై విమర్శలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు