Lokesh Kanagaraj : లియో హిట్ కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. తిరుమలకు కాలినడకన..

లియో(Leo) సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ సినిమాలో సంజిత్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, త్రిష.. పలువురు స్టార్స్ ఉన్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా రిలిజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.

Vijay Leo Movie Director Lokesh Kanagaraj went to Tirumala

Lokesh Kanagaraj : తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వడం, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడంతో అతని సినిమాపై అందరికి ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ తో లియో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విజయ్(Vijay) కి మాస్టర్ సినిమాతో హిట్ ఇచ్చాడు లోకేష్.

లియో(Leo) సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ సినిమాలో సంజిత్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, త్రిష.. పలువురు స్టార్స్ ఉన్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా రిలిజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. లియో సినిమా దసరా(Dasara) కానుకగా అక్టోబర్ 19న పాన్ ఇండియా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. తాజాగా లియో సినిమా రిలీజ్ కి ముందు లోకేష్ కనగరాజ్ తిరుమలకు వచ్చాడు.

Also Read : Unstoppable Season 3 : షూటింగ్ కూడా అయిపోయింది.. అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..

ఇవాళ తెల్లవారు జామున లోకేష్ కనగరాజ్ తన టీంతో కలిసి తిరుమలకు కాలినడకన వెళ్ళాడు. తన టీంలోని ఓ రైటర్ తిరుమలకు మెట్లు ఎక్కుతుండగా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తిరుమల రూమ్ లో కూడా లోకేష్ తో ఓ సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేసాడు. దీంతో లోకేష్ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. లోకేష్ అతని టీం నేడు స్వామివారిని దర్శించుకోనున్నారు. లియో భారీ విజయం సాధించాలని లోకేష్ ఇలా సినిమా రిలీజ్ కి ముందు తిరుమలకు వచ్చినట్టు సమాచారం.