Leo Movie Collections : లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన లియో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ని రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ..

Vijay Lokesh Kanagaraj Leo Movie first day world wide Collections

Leo Movie Collections : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఈ చిత్రాన్ని కూడా LCUలో భాగంగా తెరకెక్కిస్తున్నాడా అనే ఆసక్తితో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అనుకున్నట్లే ఈ లియోని ఖైదీ, విక్రమ్ సినిమాలకి కనెక్షన్ పెట్టి ఆడియన్స్ కి మంచి థ్రిల్ నే కలగజేశాడు లోకేష్ కానగరాజ్.

తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ని రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.132.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.ఇప్పటివరకు రిలీజ్ అయిన తమిళ్ సినిమాల్లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్. ఇక ఒక్క తమిళనాడులోనే ఈ మూవీ రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ విషయంలో కూడా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం.

Also read : Leo Movie Review : లియో మూవీ రివ్యూ.. కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే హీరో..

ఇక తమిళంలో 100 కోట్లకు పైగా, తెలుగులో 20 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా, అలాగే తమిళంలో 200 కోట్లు, తెలుగులో 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ప్రస్తుతం ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఒక పక్క భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. మరి వాటిని తట్టుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా..? లేదా..? అనేది చూడాలి.