Site icon 10TV Telugu

Arjun Chakravarthy : ఆరేళ్ళ కష్టానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్.. అర్జున్ చక్రవర్తి థ్యాంక్యూ మీట్..

Vijay Ramaraju Arjun Chakravarthy Kabaddy Movie Thank You Meet

Arjun Chakravarthy

Arjun Chakravarthy : విజయ రామరాజు మెయిన్ లీడ్ లో నటించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘అర్జున్ చక్రవర్తి’. శ్రీని గుబ్బల నిర్మాణంలో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ఆగస్టు 29న థియేటర్స్ లో రిలీజయింది. రిలీజ్ కి ముందే ఈ సినిమా 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకుంది. 1980 కాలంలో కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.(Arjun Chakravarthy)

ఈ థ్యాంక్యూ మీట్ లో డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ.. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇంకా చాలామంది సినిమా చూడలేదు, ఈ సినిమా తప్పకుండా చూడాలి. ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇస్తేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమాకి డెడికేటెడ్ గా పనిచేశారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది సిజా. చాలా అద్భుతంగా నటించింది. మాకు సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.

Also Read : Pawan Kalyan : సినిమాల్లో స్టార్.. రాజకీయాల్లో లీడర్.. సామాన్యుల కోసం సుఖాలను వదిలి వచ్చిన ‘బంగారం’.. ‘పవన్ కళ్యాణ్’ బర్త్ డే స్పెషల్..

హీరో విజయరామరాజు మాట్లాడుతూ… ఆరేళ్ళ కష్టానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పర్ఫార్మన్స్ అంతటికి క్రెడిట్ డైరెక్టర్ కి దక్కుతుంది. మా నిర్మాత శ్రీని లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. నేను ఎంత కష్టపడినా మా వెనక ఉండి ఒక కొండంత ధైర్యంతో నడిపించారు. ఆరేళ్లుగా మా నిర్మాత ఈ సినిమా బరువుని మోసారు. ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉంటారు అని అన్నారు. హీరోయిన్ సిజా రోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి తెలుగు సినిమా ఇంత మంచి అద్భుతమైన రివ్యూస్ తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. దేవిక పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపింది.

నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, మేము ఇన్స్టాగ్రామ్ లో చేసిన సర్వే పక్కా మ్యాచ్ అయ్యే అయ్యాయి. యుఎస్ లో ఇండియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు అని అన్నారు. యాక్టర్ దయానంద్ రెడ్డి మాట్లాడుతూ… దాదాపు వంద సినిమాలు చేశాను. అన్ని సినిమాల్లో ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో రంగయ్య క్యారెక్టర్ నా కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది అని తెలిపారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్.. లుక్స్ అదిరిపోయాయి గా..

Exit mobile version