Ram Charan : RC16 గురించి వైరల్ అవుతున్న వార్తలు.. విజయ్ సేతుపతి..!

రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా గురించి గత కొన్నిరోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనా..? విజయ్ సేతుపతి ఈ మూవీలో నటిస్తున్నాడు..!

Vijay Sethupahti in Ram Charan Buchi Babu Sana RC16 movie

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనకి ఇటీవల పాప పుట్టడంతో కూతురితో కలిసి కొన్నిరోజులు టైం స్పెండ్ చేయడానికి షూటింగ్స్ కి విరామం ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే, కొన్ని రోజులు నుంచి రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ RC16 గురించి కొన్ని ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నాడంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్తే.

Kichcha Sudeep : అబద్దపు ఆరోపణలు అంటూ.. ఆ నిర్మాతపై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కిచ్చ సుదీప్..

అయితే ఇప్పుడు రెహమాన్ కన్ఫర్మ్ అయ్యిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తతో పాటు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో తమిళ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించబోతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. RC16 తెరకెక్కించబోతున్న దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమా విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ సేతుపతిని బుచ్చిబాబు ఎంపిక చేసుకున్నట్లు వినిపిస్తుంది.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ రేంజ్ పెరిగిందా? మృణాల్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుంది. రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట్ సతీస్ కిలారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతుంది.