Laabam: వినాయక చవితికి విజయ్ సేతుపతి “లాభం”.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా 'లాభం'.

Labham

Vijay Sethupathi And Shruti Haasan’s Laabam: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘లాభం’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేశారు. సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి వైలు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాని సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులో ఏక కాలంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ టైం రెండు భాషల్లోనూ విడుదల అవుతోంది.

జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా.. సాయి ధన్సిక ప్రధాన పాత్ర పోషిస్తోంది. SP జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి లాయర్ శ్రీరామ్ సమర్పణలో హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన చిత్రం తెలుగులో విడుదల అవుతున్న ఈ సినిమా ఇదే. విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. “విజయ్ సేతుపతి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యాయి. తెలుగులో నేరుగా నటించిన సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ‘లాభం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారని బావిస్తున్నాను అని అన్నారు.0 ఇందులో అతని పాత్ర గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అంటున్నారు నిర్మాతలు. రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని అలరిస్తారని అంటున్నారు నిర్మాతలు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.