‘A’ మూవీ టీం ని అభినందించిన ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి..

A Movie: నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్‌గా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విడుదల చేయగా మంచి స్పందన రావడంతో పాటు సినిమా అంచనాలను పెరిగాయి..

తాజాగా ‘A’ మూవీ టీం ని అభినందించారు విజయ్ సేతుపతి. చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. ఇటీవలే ముంబైలో ఉన్న విజయ్ సేతుపతిని చిత్ర బృందం కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొంత పార్ట్‌ని చూసి అయన ఎంతో థ్రిల్‌ ఫీలయ్యారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

విజయ్ సేతుపతి సపోర్ట్ ఉండడంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువయ్యింది. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని PVR పిక్చర్స్ వారు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నిఅందించారు.\