Vijay Sethupathi funny comments on actress Andrea
Andrea: ఆండ్రియా.. ఈ నటి గురించి చాలా మందికి తెలియదు. కానీ, గాయనిగా మాత్రం చాలా మందికి తెలుసు. తనదైన గొంతుతో పాటలు పాడి కొన్ని లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో “జరా.. జరా.. “, ధడ సినిమాలో(Andrea) “దివాలి దీపాన్ని” లాంటి పాటలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాటలు చాట్ బస్టర్ గానే నిలిచిపోయాయి. అలా తన గాత్రంతో అలరించిన ఆండ్రియా.. తరువాత నటిగా మారి చాలా సినిమాలే చేసింది.
Imanvi: ఫౌజీ భామకు ప్రభాస్ ఆతిథ్యం.. కడుపు నిండిపోయింది ప్రభాస్ గారూ..
తెలుగులో ఆమె నటించిన సినిమా తడాఖా. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే, ఈ అమ్మడు తాజాగా నటించిన తమిళ సినిమా మాస్క్. కవిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆండ్రియా విలన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో ఆండ్రియా గురించి మాట్లాడుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి.
“నేను చిన్నప్పుడు బీచ్ ఒడ్డున ఓ విగ్రహాన్ని చూశాను. ఆ తరువాత నిన్ను చూశాను. అప్పటినుంచి ఇప్పటివరకు రెండిటిలో ఎలాంటి మార్పు లేదు. చాలా ఏళ్ల క్రితం నటించిన యాడ్‌లో ఉన్నట్టుగానే ఇప్పుడూ ఉన్నావ్. నా కొడుకు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇంతకీ నువ్వు బెడ్ పై పడుకుంటున్నావా? లేక ఫ్రిజ్‌లోనా..? నాకు అర్థం కావడంలేదు” అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు విజయ్ సేతుపతి. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.