Imanvi: ఫౌజీ భామకు ప్రభాస్ ఆతిథ్యం.. కడుపు నిండిపోయింది ప్రభాస్ గారూ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా మందికి ప్రేమ. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన్ని(Imanvi) ఇష్టపడతారు. ఎందుకంటే, ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ. ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా సింపుల్ గా ఉంటారు.
Heroine Imanvi posts interesting post about food sent by Prabhas
Imanvi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా మందికి ప్రేమ. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన్ని (Imanvi)ఇష్టపడతారు. ఎందుకంటే, ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ. ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా సింపుల్ గా ఉంటారు. ఇక ప్రభాస్ కి మరో అలవాటు ఏంటంటే తనతో పని చేసేవారికి భోజనాలు పెట్టడం. ఆ భోజనం కూడా మాములుగా ఉండదు. ఇప్పటికే ఈ విషయం గురించి చాలా మంది చెప్పుకొచ్చారు. రకరకాల వంటకాలు చేయించు వారికి పంపిస్తూ ఉంటారు. తాజాగా ప్రభాస్ నుంచి అద్భుతమైన భోజనాన్ని అందుకుంది ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి.
RT76: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవి తేజ కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది
ప్రస్తుతం ఈ నటి ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఇమాన్వికి భోజనం పంపించాడట ప్రభాస్. ఆ విషయాన్నీ వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఇమాన్వి. “సర్‌ప్రైజింగ్‌గా, సంతోషంగా ఉంది. ప్రభాస్ గారు మీ ఆతిథ్యానికి నా మనస్సు, పొట్ట నిండుగా మారిపోయింది. మీ ఆతిథ్యానికి నా ధన్యవాదాలు”అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే, ఆర్మీ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 50 శాతం కన్నా ఎక్కువ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సీతా రామం సినిమాకు సోల్ ఫుల్ మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Imanvi and Prabhas
